రైతుల సమస్యలను రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదంటూ హరీష్రావు నిప్పులు
రిపోర్టర్: గోపి
స్థలం: వనపర్తి
రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. వనపర్తి జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. కరువు మండలాలను ప్రకటించడమే తప్ప ఆర్థిక సహాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.