ఖమ్మంలో అనాథల కోసం కొలువుదీరిన సేవా ఫౌండేషన్ ఆశ్రమం

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం సాయి గణేష్ నగర్ రోడ్ నంబర్ పన్నెండులో డాక్టర్ పాలకుర్తి కృష్ణ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ సేవా ఫౌండేషన్ అనాథ ఆశ్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. అనాథలు, నిరాశ్రయులు, నిరుపేదలకు ఆశ్రయం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. రాబోయే రోజుల్లో వైద్య, విద్య, సామాజిక సేవలను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.