గణేష్ ఉత్సవాల్లో అప్రమత్తతతో భద్రతను కాపాడుకోవాలి

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంచిర్యాల పట్టణంలోని పలు మండపాలను ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపాల వద్ద విద్యుత్ వైరింగ్లో జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. పోలీసుల నిబంధనలకు లోబడి ఉత్సవాలు నిర్వహించాలని, అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీపీ స్పష్టం చేశారు.