రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి ప్రత్యేక గ్రోత్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు మంత్రి కొండపల్లి ప్రకటన

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎంఎస్‌ఎంఈల బలోపేతం కోసం గ్రోత్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త ప్రభుత్వ లక్ష్యమని, డిజిటల్ వాణిజ్యం, ఈ-కామర్స్, ఎగుమతులు మరియు ప్రభుత్వ పథకాలను పారిశ్రామికవేత్తలకు చేరువ చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.