హైదరాబాద్‌లో కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఉద్యోగినిపై లైంగిక దాడి
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై తీవ్ర అఘాయిత్యం జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతిని టార్గెట్ చేసి ఫుడ్‌వెండర్‌గా పనిచేస్తున్న షేక్‌నబీ కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడని అధికారులు పేర్కొన్నారు. ఈ దుశ్చర్యకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను రహస్యంగా రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.