ఆంధ్రప్రదేశ్ తీరాలపై అర్నబ్ తుఫాను ప్రభావం: ఉప్పాడ రహదారి ధ్వంసం
రిపోర్టర్: రమేష్
స్థలం: కాకినాడ
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై అర్నబ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉందని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా మారి రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతుండటంతో కాకినాడ జిల్లా ఉప్పాడ రహదారి ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తపట్నం, ఓడలరేవు తీరాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.