ఓట్ల చోరీ ద్వారానే ప్రధాని మోదీ అయ్యారన్న కాంగ్రెస్
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
నరేంద్ర మోదీ ఓట్ల చోరీ ద్వారానే ప్రధాని అయ్యారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో డిస్కంలలో ఏకంగా 81 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.