ప్రజావాణి అర్జీలను తక్షణమే తేల్చాలంటూ అధికారులపై కలెక్టర్ వార్నింగ్

రిపోర్టర్: dumarla bhaskar senier journalist స్థలం: అచ్చంపేట

సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో దరఖాస్తు చేసిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులు శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ ఏమంత కేశవ పాటిల్ సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుండి యాభై ఏడు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించి వారికి ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ ఆదేశించారు.