హైదరాబాద్లో వైభవంగా కొనసాగుతున్న గణేశ్ నిమజ్జన శోభాయాత్ర

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉత్సవాన్ని విజయవంతం చేస్తున్న ప్రజలందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భక్తులు భారీగా తరలిరావడంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.