పెద్దమ్మతల్లి ఆలయ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి వినతి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కోహెడ
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ధర్మసాగర్పల్లి గ్రామంలో పెద్దమ్మతల్లి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ ఆదివారం బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం ఆధ్వర్యంలో కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.