దేశీయ క్రికెట్ అంపైర్లు మ్యాచ్ రెఫరీలకు భారీగా పెరగనున్న వేతనాలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ముంబై

దేశీయ క్రికెట్ మ్యాచ్ అధికారులకు బిసిసిఐ గుడ్ న్యూస్ చెప్పింది. 2026-27 దేశీయ సీజన్ నుండి దేశీయ అంపైర్లు మరియు మ్యాచ్ రెఫరీల మ్యాచ్ ఫీజులను పెంచాలని బిసిసిఐ నిర్ణయించింది. అంపైర్ల వ్యవస్థను ఏ, బి, సి మరియు డి అనే నాలుగు గ్రేడ్లుగా పునర్వ్యవస్థీకరించనున్నట్లు బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. రంజీ ట్రోఫీ సహా ఇతర దేశీయ టోర్నీలలో పాల్గొనే అధికారులకు ఈ నూతన వేతన సవరణ వర్తించనుంది.