ఆదోనిలో పోలీసుల పరేడ్: వినాయక ఉత్సవాలు, ఎన్నికలపై ప్రత్యేక దృష్టి
రిపోర్టర్: మహేష్
స్థలం: Adoni, Kurnool
వినాయక ఉత్సవాలు మరియు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆదోనిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, డీఎస్పీ వెంకటరమణ పర్యవేక్షణలో ఆదోని టూ టౌన్ పోలీసులు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో ప్రత్యేక పరేడ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.