భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్కు వీడ్కోలు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
భారత సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు. టెస్టు క్రికెట్ ఆడాలనే తన చిరకాల స్వప్నం సాకారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వైట్ బాల్ ఫార్మాట్లలో మాత్రం జాతీయ జట్టు తరఫున మరోసారి ఆడతాననే ధీమాను వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. 2009 నుంచి హర్యానా తరఫున ఆడిన ఆయన పలు రికార్డులు సాధించారు.