తిరుపతిలో భారీ వర్షం: అలిపిరి వద్ద భక్తుల నరకయాతన

రిపోర్టర్: వెంకట్ స్థలం: తిరుపతి

తిరుపతి నగరంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ వర్షపు నీటితో నిండిపోయి రోడ్లు చెరువులను తలపించాయి. ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద క్యూ లైన్లలో నిలబడిన భక్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. తనిఖీల ప్రక్రియ నెమ్మదించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.