భారత వాయుసేన నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియామకం

రిపోర్టర్: నరేష్ స్థలం: New Delhi

భారత వాయుసేన నూతన చీఫ్గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియామకమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం వైస్ చీఫ్గా సేవలందిస్తున్న ఆయన, అక్టోబర్ 31, 2026 నుంచి ఎయిర్ చీఫ్ మార్షల్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అదే రోజు పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత వాయుసేన అధిపతి అమర్ ప్రీత్ సింగ్ స్థానంలో ఆయన ఈ అత్యున్నత పదవిని చేపట్టనున్నారు. సుదీర్ఘ కాలంగా వివిధ హోదాల్లో దేశానికి సేవలు అందించిన ఆయన నియామకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.