విజయనగరం జిల్లాలో బొత్స కుమార్తె అనూషకు భారీ షాక్

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఓటమి పాలయ్యారని అధికారులు వెల్లడించారు. ఆమెపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశాల నీరజ ఐదు వేల నూట ముప్ పై ఆరు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో బొండపల్లి ప్రాంతంలో కూటమి శ్రేణులు ఘనంగా సంబరాలు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.