మహాశక్తి విజువల్స్ విమర్శలపై దర్శకుడు సుందర్ సి తీవ్ర ఆవేదన
రిపోర్టర్: సునీల్
స్థలం: చెన్నై
మహాశక్తి చిత్రంలో విజువల్స్ పై వస్తున్న విమర్శలు తీవ్ర ఆవేదన కలిగించాయని దర్శకుడు సుందర్ సి వెల్లడించారు. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ భక్తిరస చిత్రంలో మూడు వేలకు పైగా సీజీఐ షాట్లు ఉండగా, కేవలం పదిహేను షాట్లకు మాత్రమే కృత్రిమ మేధస్సును వాడామని స్పష్టం చేశారు. ఎనిమిది వందల మంది సాంకేతిక నిపుణులు ఏడాదికి పైగా శ్రమించి గ్రాఫిక్స్ రూపొందించారని, వారి కష్టాన్ని గుర్తించకుండా విమర్శించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.