మనుబోలులో విఘ్నేశ్వరుని మండపం వద్ద భక్తుల కొరకు భారీ అన్నదానం

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో విఘ్నేశ్వరుని మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ అన్నదానం చేపట్టారు. చింతల ఈశ్వరయ్య, శాంతి దంపతులు ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.