హిట్లర్ను మించిపోయిన మోదీ: అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం

రిపోర్టర్: వెంకట్ స్థలం: New Delhi

ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల అణచివేతను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ హిట్లర్ను మించి రాచరిక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. యువతులు, లాయర్లు, జర్నలిస్టులపై దాడులు చేయడం దారుణమన్నారు. జ్ఞానేష్ కుమార్ తో పాటు మోదీ కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని కేజ్రీవాల్ హెచ్చరించినట్లు ఎక్స్ వేదికగా వెలువడిన వీడియోలో స్పష్టమైంది.