బ్రిక్స్ సదస్సులో భారతదేశం నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి

రిపోర్టర్: సతీష్ స్థలం: India

బ్రిక్స్ సదస్సు రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ భారత్ తరఫున నాలుగు కీలక స్థంబాలను ఆవిష్కరించారు. వృద్ధి, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. అంటువ్యాధుల నివారణకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని తెలిపారు. బ్రిక్స్ దేశాల ప్రయోజనాలతో పాటు గ్లోబల్ సౌత్ దేశాలకు కూడా ఈ నిర్ణయాలు ప్రయోజనం చేకూర్చాలని మోదీ స్పష్టం చేశారు.