ఏఐ ప్రభావంతో బ్రిటన్‌లో ఉపాధి కోల్పోయిన భారతీయ ఐటీ నిపుణుడు
రిపోర్టర్: సురేష్
స్థలం: లండన్
బ్రిటన్‌లో పదిహేనేళ్లుగా ఐటీ రంగంలో పనిచేస్తున్న ఒక భారతీయ నిపుణుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఆయన మాట్లాడుతూ, కంపెనీలు క్రమంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయని, ఆటోమేషన్‌కు గురయ్యే టెక్నాలజీ విభాగాల్లో పనిచేసే వారి ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. అయితే తగిన పొదుపు, సరైన బ్యాకప్ ప్రణాళిక ఉండటం వల్ల తాను ఆందోళన చెందడం లేదని ఆయన స్పష్టం చేశారు.