ఏపీ పింఛన్ల పంపిణీలో కొత్త విధానం: నేరుగా అకౌంట్లోకి కేంద్ర వాటా

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు రానున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ వాటా డబ్బులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేయనుండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటాను మాత్రం సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటికే వచ్చి లబ్ధిదారుల చేతికి అందజేస్తారని అధికారులు వెల్లడించారు.