పాలమూరు రైతులను తొక్కుతున్నారంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
నీళ్లు, కరెంటు ఇవ్వకుండా పాలమూరులో వ్యవసాయాన్ని రేవంత్ రెడ్డి పండబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. జూరాల ఆయకట్టులో ఒక్క ఎకరం ఎండినా ప్రభుత్వానిదే బాధ్యతని, రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. పాలమూరు రైతులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.