'విద్యార్థుల భద్రతపై అవగాహన': విశాఖ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేక కార్యక్రమాలు

రిపోర్టర్: రమేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నగరంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు పాఠశాల మరియు కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్, హ్యూమన్ ట్రాఫికింగ్, బాల్య వివాహాలు వంటి కీలక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు భద్రతాపరమైన జాగ్రత్తలు పాటించాలని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీస్ శాఖను సంప్రదించాలని అధికారులు సూచించారు.