ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఖమ్మం జిల్లా నేత చింతల రమేష్ ఏకగ్రీవ ఎన్నిక
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
యాదగిరిగుట్టలో జరుగుతున్న ఏఐవైఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభల్లో ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ చింతల రమేష్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యువత సమస్యలపై నిరంతరం పోరాడుతూ, నిరుద్యోగం, ఉపాధి, విద్య, సామాజిక న్యాయం కోసం ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయనకు రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించడం పట్ల ఖమ్మం జిల్లా నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రమేష్ ఎన్నికతో జిల్లా సంఘంలో నూతన ఉత్సాహం నెలకొంది.