చాగంటి వ్యాఖ్యలను విస్మరించి డీజేలకు నారా లోకేష్ అనుమతి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమరావతి

గతేడాది వినాయక నిమజ్జనంలో డీజేలు, శబ్ద కాలుష్యం, వికృత పోకడలు అపచారమని ప్రఖ్యాత ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను టీడీపీ విస్మరించింది. గతేడాది చాగంటి వ్యాఖ్యలతో అధికారికంగా ట్వీట్ చేసిన తెలుగు దేశం పార్టీ, ఈ ఏడాది మాత్రం నిమజ్జనంలో డీజేలకు అనుమతిస్తూ హోం మంత్రి, డీజీపీకి మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.