గరివిడిలో దారుణం: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెచ్ఎం సస్పెన్షన్

రిపోర్టర్: రాము స్థలం: గరివిడి

గరివిడి మండలం గదబవలస ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.బాబ్జి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఎస్సై లోకేశ్వరరావు వెల్లడించారు. బాలికల తల్లిదండ్రులు మరియు గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు నిందితుడైన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.