హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ వేధింపులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఇరవై ఆరు ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. క్యాబ్ దిగుతున్న సమయంలో బాధితురాలిని బలవంతంగా పట్టుకుని ముద్దుపెట్టుకున్నాడని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అయితే తాను కింద పడిపోతుంటే పట్టుకున్నానని సెక్యూరిటీ గార్డ్ వాదిస్తుండగా దర్యాప్తు కొనసాగుతోంది.