షాకింగ్ ఘటన: కరవా చౌత్ రోజునే భార్యను హతమార్చిన భర్త
రిపోర్టర్: నరేష్
స్థలం: Gwalior
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ప్రాంతంలో గృహ కలహాల నేపధ్యంలో ఆనంద్ అనే వ్యక్తి తన భార్య మధు శ్రీవాస్తవను దారుణంగా హత్య చేసినట్లు మురార్ పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. భర్త ఆయురారోగ్యాల కోసం కరవా చౌత్ వ్రతం ఆచరించి ఉపవాసం ఉన్న వివాహితను రోకలి బండతో తలపై బాది ప్రాణాలు తీశాడు. హత్య అనంతరం నిందితుడే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.