ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు: ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు

రిపోర్టర్: హరి స్థలం: World

ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన డ్రోన్ దాడుల్లో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఒడెసా ప్రాంతంలో జరిగిన దాడితో పాటు కీవ్‌లోని అపార్ట్‌మెంట్‌పై డ్రోన్ పడింది. అంతర్జాతీయ సమాజం స్పందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. రష్యా దాడులను అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.