సీఈసీ పదవికి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలన్న అభిజిత్ దీప్కే

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దేశద్రోహి అని, ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్రంగా ఆరోపించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, సీఈసీ పదవికి ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా తప్పుకోకపోతే దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.