స్థానిక సంస్థల ఎన్నికలు: బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు వెల్లడించాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం వెర్టికల్ రిజర్వేషన్లు యాభై శాతానికి మించకుండా స్థానిక సంస్థల వారీగా కేటాయించాలని స్పష్టం చేశాయి. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా గ్రామ పంచాయతీల నుంచి నగరపాలక సంస్థల వరకు రిజర్వేషన్లు నిర్ణయించనున్నట్లు ఆ శాఖల అధికారులు పేర్కొన్నారు.