విశాఖలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు

రిపోర్టర్: నరేష్ స్థలం: విశాఖపట్నం

పేదల సొంతింటి స్వప్నాన్ని సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. విశాఖపట్నంలో శనివారం సీఎం చంద్రబాబు నాయుడు 25,880 పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు అందజేయనున్నారు. విశాఖ జిల్లాలోని 11 మండలాల్లో వివిధ జీవోల కింద భూములను క్రమబద్ధీకరించి అర్హులకు ఈ హక్కులు కల్పిస్తున్నారు. త్వరలో విజయవాడలో మరో 24 వేల కుటుంబాలకు కూడా ఇళ్ల హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.