ఆన్లైన్ మోసాల వలలో పడకుండా జాగ్రత్త పడాలన్న కలమడుగు బ్యాంక్ మేనేజర్
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులో బుధవారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ కుమార్ మాట్లాడుతూ ఖాతాదారులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేసుకోవాలని, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫోన్లకు వచ్చే ఓటీపీలను ఎవరికీ చెప్పకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు.