ఇనుప గ్రిల్స్‌లో ఇరుక్కుపోయిన దొంగ, స్థానికుల దేహశుద్ధి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: గుజరాత్
గుజరాత్‌లోని సూరత్‌లో ఖాళీ ఇంట్లో చోరీకి యత్నించిన వ్యక్తి ఇనుప గ్రిల్స్‌లో ఇరుక్కుపోయాడు. బయటకు రాలేక ఇబ్బంది పడుతున్న అతడిని గుర్తించిన స్థానికులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.