షాకింగ్ ఘటన: కొత్త కారును రాత్రికి రాత్రే పదునైన వస్తువుతో ధ్వంసం చేసిన వైనం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
కొత్తగా కొనుగోలు చేసిన కారును రాత్రిపూట ఇంటి ముందు నిలిపివేయగా, ఎవరో దుండగులు పదునైన వస్తువుతో దానిపై గీట్లు గీసి తీవ్రంగా ధ్వంసం చేశారని సోషల్ మీడియా యూజర్ లక్షయ్ మెహతా వెల్లడించారు. ఈ అకృత్యంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతరుల ఆస్తుల పట్ల గౌరవం లేకపోవడాన్ని తప్పుబట్టారు. కొందరి ఈర్ష్య కారణంగానే ఇలాంటి దుర్మార్గులు ఇతరుల కష్టాన్ని నాశనం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా పలువురు ఆవేదన వెలిబుచ్చారు.