అమెరికాలో హెచ్-1బీ వీసాదారులపై ట్రంప్ సర్కార్ మరో పిడుగు
రిపోర్టర్: గోపి
స్థలం: అమెరికా
అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్1బీ, ఎల్1 వీసాదారులకు ఇస్తున్న 60 రోజుల అదనపు గడువును రద్దు చేస్తూ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ముసాయిదా ప్రతిపాదన విడుదల చేసింది. ఇకపై ఉద్యోగం పోతే తక్షణమే దేశం వీడాల్సి ఉంటుంది. ఈ కఠిన నిబంధన అమెరికాలోని భారతీయ నిపుణులు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది. వలసలపై ట్రంప్ యంత్రాంగం చేపట్టిన చర్యలు ప్రవాస భారతీయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.