ఫలితం ఇవ్వని కాస్మెటిక్ ట్రీట్మెంట్, డబ్బులు వెనక్కి ఇవ్వాలని క్లినిక్‌ను ఆదేశించిన కోర్టు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కర్ణాటక

ముఖంపై మచ్చల చికిత్స కోసం వెళ్లిన మహిళకు ఫ్యాట్ రిడక్షన్ పేరుతో అనవసరంగా రూ.1.6 లక్షలు వసూలు చేసి మోసం చేసిన క్లినిక్‌కు బెంగళూరు వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎలాంటి ఫలితాలు రాకపోవడంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా, డబ్బులు పూర్తిగా వాపసు ఇవ్వాలని ఆదేశించింది.