పన్నెండేళ్లుగా అటకెక్కిన నస్తూర్ పల్లి బొగ్గు గని ప్రాజెక్టు

రిపోర్టర్: అశోక్ స్థలం: జయశంకర్ భూపాలపల్లి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నస్తూర్ పల్లి బొగ్గు గని, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులు 18 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. రూ.30 వేల కోట్ల బొగ్గు నిక్షేపాలు ఉన్నా గని అనుమతులు అటకెక్కాయి. చిన్న కాళేశ్వరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మందికి ఉపాధి లభించడంతో పాటు ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ప్రజలు కోరుతున్నారు.