ఐఐటీ ఖరగ్పూర్ జామ్ 2027 నోటిఫికేషన్ విడుదల
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
ఐఐటీ ఖరగ్పూర్ మాస్టర్స్ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (జామ్) 2027 ప్రకటనను విడుదల చేసింది. సెప్టెంబర్ 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, అక్టోబర్ 12 చివరి గడువుగా నిర్ణయించారు. ఈ ప్రవేశ పరీక్షను 2027 ఫిబ్రవరి 14న రెండు విడతలుగా నిర్వహించనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.