జూరాల నీటి కోసం వెళ్తే బీఆర్ఎస్ నేతల అరెస్ట్
రిపోర్టర్: రాము
స్థలం: పాలమూరు
జూరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, రైతులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై తీవ్ర దుమారం రేగింది. పంటలను కాపాడుకోవడానికి నీరు అడిగితే అరెస్టులు చేయడం ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని నేతలు మండిపడ్డారు.