అమెరికాలో తెలుగు యువకుడిపై దాడి కేసు: నిందితుడికి జైలు శిక్ష
రిపోర్టర్: రమేష్
స్థలం: పల్నాడు
అమెరికాలో ఉపాధి పేరుతో పల్నాడు జిల్లాకు చెందిన మార్తల పుల్లారెడ్డిని తీసుకెళ్లి తీవ్రంగా హింసించిన ఘటనలో ప్రధాన నిందితుడు సత్తారు వెంకటేశ్రెడ్డికి అమెరికా కోర్టు యాభై నెలల ఫెడరల్ జైలు శిక్ష విధించినట్లు అధికారులు వెల్లడించారు. బాధితుడి ఇమిగ్రేషన్ పత్రాలు లాక్కొని, తిండి పెట్టకుండా కిరాతకాలకు పాల్పడిన ఈ అమానుష ఘటనలో మరో ఇద్దరు నిందితులకు కూడా కోర్టు వివిధ కాలాల పాటు శిక్షలు ఖరారు చేసినట్లు సమాచారం.