విశాఖలో వినాయక నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ బాగ్చి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో వినాయక నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి స్వయంగా పరిశీలించారు. నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, మద్యం సేవించి తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, నిమజ్జన సమయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.