జన్నారం కాంగ్రెస్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడి

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల కమిటీ నియామక ప్రక్రియ పూర్తయిందని మండల అధ్యక్షులు నందు నాయక్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఆయనకు ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నియామక పత్రాలు అందజేశారు. మండల ఉపాధ్యక్షులుగా చంద్రయ్య, ఆకుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మేకల మాణిక్యం, హేమంత్ చారి, హడాయి హనుమంతు, గొర్ల సురేష్ లతోపాటు పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.