దిల్లీలో దారుణం పదేళ్ల బాలిక అత్యాచారం హత్య కేసులో ఛార్జ్ షీట్ దాఖలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: దిల్లీ

దక్షి దిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో గత జూన్ లో పదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి దిల్లీ పోలీసులు 500 పేజీలకు పైగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నిందితుడు బసు కుమార్ సింగ్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన అనంతరం, విషయం తల్లిదండ్రులకు చెబుతుందనే భయంతో గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో 30 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు.