కృత్రిమ మేధూ స్టార్టప్ కోసం ముప్పై లక్షల డాలర్లు సేకరించిన ధ్రవ్య షా
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
సాంప్రదాయ విద్యకు దూరంగా నిలచి కృత్రిమ మేధ రంగంలో యువ పారిశ్రామికవేత్తగా ధ్రవ్య షా అద్భుతాలు సృష్టిస్తున్నారని టెక్ నిపుణులు తెలిపారు. కేవలం పందొమ్మిదేళ్ల వయస్సు కలిగిన ఈ యువకుడు సూపర్ మెమరీ పేరుతో సరికొత్త ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించి, గూగుల్ మరియు ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థల పెట్టుబడిదారుల నుంచి సుమారు ముప్పై లక్షల డాలర్ల నిధులను సమీకరించినట్లు వెల్లడించారు. ఈ విజయం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ యువత సత్తా చాటుతోందని పేర్కొన్నారు.