వికారాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారంపై ప్రజల భయాందోళన
రిపోర్టర్: వెంకట్
స్థలం: వికారాబాద్
వికారాబాద్ జిల్లా పరిధిలోని పరిగి మండలంలో పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోందని నిర్వాహకులు కృష్ణ స్వామి తెలిపారు. బసిరెడ్డిపల్లి సమీపంలోని కృష్ణగిరి క్షేత్ర గోశాలపై పులి వరుసగా దాడులు చేస్తూ గోవులను హతమారుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం లేగదూడను ఎత్తుకెళ్లిన పులి, తాజాగా మరో ఆవుపై దాడి చేసి ప్రాణాలు తీసిందని పేర్కొన్నారు. పులి కదలికలు సీసీటీవీలో రికార్డవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర వణికిపోతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పులిని బందించాలని ఆయన డిమాండ్ చేశారు.