రసాయనాలు వీడి సేంద్రియ సాగుతో భూసారాన్ని కాపాడుకోవాలని అన్నదాతలకు వ్యవసాయాధికారి పిలుపు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: దండేపల్లి
దండేపల్లి మండలంలోని ముత్యంపేటలో కేతి బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి, భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయ అధికారి శ్రీకాంత్ రైతులకు సూచించారు. ఫలితాల ఆధారంగానే ఎరువులు వాడాలని, అధిక మోతాదులో పురుగుమందులు చల్లడం వల్ల భూమి సారం దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. రైతులు సేంద్రియ సాగు వైపు మొగ్గు చూపాలని ఆయన కోరారు.