పర్వతగిరి పిఎసిఎస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన పిన్నింటి అనిల్ రావు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పర్వతగిరి
పర్వతగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన చైర్మన్గా పిన్నింటి అనిల్ రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సహకారంతో పిఎసిఎస్ ను జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, రైతులకు ప్రభుత్వం అందించే రుణాలు, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచిన నాయకులకు, రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.