తెలంగాణ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ: గడువు పొడిగింపు ఉండబోదని సీఈవో స్పష్టం

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

తెలంగాణలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ గడువును మరోసారి పొడిగించే ప్రసక్తే లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి స్పష్టం చేశారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే నవంబర్ 9న తుది ఓటరు జాబితా విడుదలవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 65 లక్షల మంది నోటీసులకు సమాధానం ఇవ్వగా, వారిలో 54 లక్షల మందిని తుది జాబితాలోకి చేర్చినట్లు సీఈవో వెల్లడించారు.